News March 16, 2025
సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. బుక్కపట్నంలోని డిగ్రీ కళాశాలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చదివిన వారు ఈ కోర్సులు నేర్చుకోవడానికి అర్హులు అన్నారు. ఆసక్తి కలవారు దరఖాస్తులు చేసుకోవాలని, మూడు నెలల శిక్షణానంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
Similar News
News December 6, 2025
ధనికులకు దండాలు.. పేదలకు దండనా?.. రైల్వే తీరుపై విమర్శలు

ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రత్యేక <<18483830>>రైళ్లను<<>>, 37 రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. ‘సామాన్యుల రద్దీతో జనరల్ బోగీలు నిండిపోయి ఇబ్బంది పడుతున్నా మా కోసం ఎప్పుడైనా అదనపు బోగీలు వేశారా? ధనవంతులకి ఒక న్యాయం, పేదవాడికి మరో న్యాయమా?’ అని మండిపడుతున్నారు. పండుగల సమయాల్లోనైనా బోగీలు పెంచాలంటున్నారు.
News December 6, 2025
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: వీసీ

కాళోజి నారాయణరావు వర్సిటీ పరిధి కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నూతన వీసీ రమేష్ రెడ్డి హెచ్చరించారు. వర్సిటీ వీసీగా శనివారం ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ర్యాగింగ్ చేసినట్లు రుజువు అయితే కళాశాల నుంచి అడ్మిషన్ సైతం తొలగిస్తామన్నారు. వైద్య విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలు కావద్దని సూచించారు.
News December 6, 2025
ఆడపిల్ల పుడితే రూ.10,000.. పండుగకు రూ.20,000!

TG: పంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. సిరిసిల్ల(D) ఆరేపల్లిలో ఓ అభ్యర్థి ఎవరికైనా ఆడపిల్ల జన్మిస్తే ఆమె పేరిట రూ.10వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు మెదక్(D) కాప్రాయిపల్లిలో ఓ అభ్యర్థి ఏకంగా 15 హామీలను బాండ్ పేపర్‌పై రాసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో ఆడపిల్ల పుడితే ₹2వేలు, తీజ్ పండుగకు ₹20వేలు, అంత్యక్రియలకు ₹5వేలు వంటి హామీలున్నాయి.


