News February 27, 2025

సీసీ కెమెరాలతో పర్యవేక్షణ: బాపట్ల ఎస్పీ

image

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బాపట్ల పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ తుషార్ డూడి పరిశీలించారు. మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని.. సీసీ కెమెరాలు ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఆయన వెంట డీఎస్పీ రామాంజనేయులు పాల్గొన్నారు.

Similar News

News March 23, 2025

కోర్ట్.. 9 రోజుల్లో రూ.46.80 కోట్లు

image

రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 9 రోజుల్లోనే రూ.46.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇవాళ్టితో రూ.50 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హీరో నాని నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు.

News March 23, 2025

ఎయిర్ టాక్సీలకు కేంద్రంగా గుంటూరు

image

ఎయిర్ టాక్సీలకు కేంద్రంగా గుంటూరు మారుతోంది. ఈ గాల్లో ఎగిరే టాక్సీలను తయారు చేస్తున్న సంస్థ పేరు మ్యాగ్నమ్ వింగ్స్. గుంటూరు నల్ల చెరువులో చావా అభిరాం అనే వ్యక్తి ఈ ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నాడు. ట్రాఫిక్‌తో సతమతమవుతున్న నగరాల్లో ఎయిర్‌ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ పనికి పూనుకున్నారు. తక్కువ ఖర్చుతో ఈ ఎయిర్‌ ట్యాక్సీలో ప్రయాణం చేసేలా రూపొందిస్తున్నారు.

News March 23, 2025

విజయనగరం పోలీసుల సేవలకు గుర్తింపు

image

రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఉగాది పురస్కారాలకు విజయనగరం పోలీస్ శాఖలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది ఎంపికయ్యారు. స్థానిక ఎస్బి ఎస్ఐ వై.సత్యనారాయణ, ఎస్సీ, ఎస్టీ సెల్ ASI ప్రసాదరావు, ఆర్మడ్ రిజర్వ్ ఏఆర్ SI అప్పలరాజు, AR హెడ్ కానిస్టేబుల్ గోవిందం, AR కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఉగాది పురస్కారాలకు ఎంపికైనట్లు ఎస్పీ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!