News March 26, 2024
సీసీ కెమెరాల ధ్వంసం.. పదో తరగతి విద్యార్థులు ఇంటికి..

ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులను పాఠశాల యజమాన్యం తమ ఇళ్లకు పంపించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏడుగురు సోమవారం అర్ధరాత్రి విద్యాలయలోని సీసీ కెమెరాల ధ్వంసానికి పాల్పడ్డారు. బయటి వారు చేశారని తొలుత పోలీసులను ఆశ్రయించామని, విద్యార్థులే అని తేలడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామన్నారు.
Similar News
News December 11, 2025
వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ పై నిఘా: కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా మొదటి విడత 7 గ్రామపంచాయతీలో జరిగే పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సిబ్బందిని సూచించారు.
News December 11, 2025
KMM: ‘అయ్యా బాబోయ్.. 10 రోజుల్లో రూ.125 కోట్ల మద్యం తాగేశారు’

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు మద్యం, నగదును ప్రధాన హస్తంగా మలుచుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో గడిచిన పది రోజుల్లో రూ.125 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. కాగా ఈ నెల 17 వరకు పంచాయతీ ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు మరింతగా పెరిగా అవకాశం ఉంది.
News December 11, 2025
ఖమ్మం గ్రామాల్లో ఉత్కంఠ.. ఓటేసేందుకు రెడీనా?

ఖమ్మం జిల్లాలో తొలివిడతలో 7 మండలాలకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. బోనకల్(22), చింతకాని(26), కొణిజర్ల(27), మధిర(27), రఘునాథపాలెం(37), వైరా(22), ఎర్రుపాలెం(31) మండలాల్లో జరగనున్నాయి. పోలింగ్ ఉ. 7 నుంచి మ. 1గంట వరకు జరగనుండగా.. మ. 2గంటల నుంచి నుండి ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి ఓటేసేందుకు రెడీనా?


