News March 22, 2025
సీసీ రోడ్ల నిర్మాణంలో కర్నూలు జిల్లా నం.1: పవన్ కళ్యాణ్

సీసీ రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఓర్వకల్లు మం. పూడిచెర్ల బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తెలిపారు. జిల్లాలో రూ.75 కోట్లతో 117 కి.మీ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో 98% రోడ్ల నిర్మాణం పూర్తయిందని, దీనికి కలెక్టర్ రంజిత్ బాషాకు అభినందనలు తెలిపారు. అందుకే పూడిచెర్లలో నీటి కుంటల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
Similar News
News January 11, 2026
అమెరికా గుప్పిట్లో వెనిజులా నిధులు.. ఆయిల్ ఆదాయం సేఫ్

వెనిజులా ఆయిల్ ఆదాయంపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అకౌంట్లలో ఉండే ఆ సొమ్మును ఎవరూ జప్తు చేయకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ డబ్బును US తన విదేశీ విధానాల కోసం వాడుకోనుంది. నార్కో టెర్రరిజం అరికట్టడానికి, అక్రమ వలసలు ఆపడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని వైట్ హౌస్ తెలిపింది. వెనిజులా ఇకపై అమెరికాతోనే వ్యాపారం చేస్తుందని, ఇది రెండు దేశాలకు మంచిదని ట్రంప్ చెప్పారు.
News January 11, 2026
నేడు రామగుండంలో మంత్రుల పర్యటన

రామగుండం నగరంలో నేడు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించి రూ.175 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. అనంతరం గోదావరిఖని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
News January 11, 2026
పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రికార్డు రాకపోకలు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల జాతర కనిపిస్తోంది. పండుగకు మరో మూడు రోజుల సమయం ఉండగానే ప్రయాణికులు తరలివెళ్తుండటంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ రికార్డు స్థాయికి చేరింది. సాధారణ రోజుల్లో 35 వేల నుంచి 40 వేల వాహనాలు తిరిగే ఈ మార్గంలో, గడచిన రెండు రోజుల్లోనే సుమారు 1.35 లక్షల వాహనాలు రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు.


