News November 14, 2024
సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
గుంటూరు కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఎస్. నాగలక్ష్మీ ఐఏఎస్. గురువారం పెదకాకానిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించి, పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంపై ఆమె దృష్టి సారించారు.
Similar News
News November 15, 2024
బోరుగడ్డ అనిల్ వివాదం.. మరోసారి పోలీసులు సస్పెండ్
గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ గురువారం అరండల్ పేట పోలీస్ స్టేషన్కు సంబంధించిన ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. బోరుగడ్డ అనిల్ అరండల్ పేట పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్న సమయంలో అధికారులు నిబంధనలను ఉల్లంఘించి అనిల్ మేనల్లుడిని లోనికి అనుమతించారు. ఈ అంశంలో హెడ్ కానిస్టేబుళ్లతో పాటూ ఒక కానిస్టేబుల్ ప్రమేయం ఉండటంతో సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
News November 14, 2024
విడదల రజినీ, డైమండ్ బాబుకి కీలక బాధ్యతలు
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసం జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరఫున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇందులో గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి విడదల రజిని, తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబుకు బాధ్యతలు అప్పగించారు.
News November 14, 2024
నాదెండ్ల: బస్సులు ఢీ.. విద్యార్థులకు తీవ్రగాయాలు
ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న సంఘటన నాదెండ్ల మండలం సాతులూరు వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ బస్సు గుంటూరు నుంచి బయలుదేరి సాతులూరు సమీపంలోకి రాగానే ప్రైవేట్ పాఠశాల బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.