News November 29, 2024

సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

image

జిల్లాలో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనుల పూర్తికి 4 వారాలు మాత్రమే సమయం ఉందని, నాణ్యత ప్రమాణాలు పాటించి మండలాల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజినీర్లను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. 1,026 సీసీ రోడ్ల నిర్మాణానికి గాను 255 రోడ్లు పూర్తి అయ్యాయని, మిగిలిన 771 సీసీ రోడ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

Similar News

News November 29, 2024

పురిటి నొప్పులతో మహిళ.. ఆదోనిలో బైక్‌పై ప్రసవం

image

నిండు గర్భిణి బైక్‌పైనే ప్రసవించిన ఘటన ఆదోనిలో జరిగింది. క్రాంతినగర్‌కు చెందిన మహిళ లలితకు నిన్న పురిటి నొప్పులు రాగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. సమయానికి ఆటోలు లేకపోవడంతో బైక్‌పైనే ఆమెను ఎక్కించుకుని బయలుదేరారు. కొంత దూరం వెళ్లగానే నొప్పులు ఎక్కువై బిడ్డ తల బయటకి వచ్చింది. వెంటనే సమీపంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు నార్మల్ డెలివరీ చేయగా కవలలు జన్మించారు.

News November 29, 2024

అంజలి శర్వాణీని రిటైన్ చేసుకున్న యూపీ వారియర్స్

image

ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో టీమ్ఇండియా క్రికెటర్ అంజలి శర్వాణీని యూపీ వారియర్స్ రిటైన్ చేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఆమెను గతేడాది వేలంలో ఆ జట్టు రూ.55లక్షలకు కొనుగోలు చేసింది. వచ్చే సీజన్ కోసం డిసెంబర్ 15న మినీ వేలం జరగనుండగా ఆయా ఫ్రాంజైజీలు పలువురు ప్లేయర్లను వదులుకున్నాయి. కాగా 2012లో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అంజలి తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు.

News November 29, 2024

ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

image

కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని నక్కల మిట్ట వద్ద ట్రాక్టర్ టైర్ పేలి బోల్తాపడటంతో మల్లికార్జున(25) మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ రామాంజనేయలు వివరాల ప్రకారం.. ఓర్వకల్ నుంచి వెల్దుర్తికి రాళ్ల లోడ్‌తో వస్తుండగా ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులు నాగేశ్వరావు, కృష్ణలను స్థానికులు హుటాహుటిగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.