News March 27, 2024

సీ.విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి: జేసీ

image

సీ విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమీక్షించారు. ప్రవేటు భవనాలపై వాల్ పేయింటింగ్‌కు ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించాలన్నారు. ఓటర్లను చైతన్యపరిచే స్వీప్ కార్యక్రమాల నివేదిక తయారు చేయాలన్నారు.

Similar News

News March 19, 2025

ప.గో: మినహాయింపు కోరుతూ డీఈవోకి వినతి 

image

ఏప్రిల్ మూడో తేదీ నుంచి జరగనున్న పదో తరగతి స్పాట్ మూల్యాంకనంలో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న వారికి మినహాయింపు కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓకి వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు మాట్లాడుతూ ప్రెగ్నెంట్ ఉమెన్, 60 సంవత్సరాలు పైబడిన వారికి, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

News March 18, 2025

లింగపాలెం కుర్రోడికి సినిమా హీరోగా ఛాన్స్

image

సినిమా యాక్టర్లు అంటే పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాలలో ఓ క్రేజ్ ఉంటుంది. లింగపాలెంకు చెందిన తరుణ్ సాయి హీరోగా సినిమాలో నటిస్తున్నాడు. ఈ ప్రాంత ప్రజలు ఎవరూ ఊహించిన విధంగా తరుణ్ సాయి హీరో అయ్యాడు. స్థానిక శ్రీనివాసరావు, కుమారి దంపతుల పెద్ద కుమారుడికి హీరోగా అవకాశం వచ్చింది. ఈయన హీరోగా నటించిన పెళ్లిరోజు సినిమా దాదాపు పూర్తైంది. ఏప్రిల్‌లో విడుదల చేయటానికి సిద్ధమవుతున్నారు.

News March 18, 2025

కాళ్ల : శివయ్యను తాకిన సూర్యకిరణాలు

image

కాళ్ల మండలం సీసలి గ్రామంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అద్భుత సన్నివేశం చోటుచేసుకుంది. గర్భాలయంలోని శివలింగాన్ని సుమారు పది నిమిషాల పాటు సూర్యకిరణాలు తాకాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఆదివారం నుంచి వరుసగా మూడు రోజులపాటు స్వామివారి లింగాన్ని సూర్యకిరణాలు తాకటం విశేషమని తెలిపారు. భక్తులు తరలివచ్చి అద్భుత సన్నివేశాన్ని చూస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

error: Content is protected !!