News April 7, 2024
సీ విజిల్ ఫిర్యాదుల పరిష్కారం: డిల్లీరావు

సీ-విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి గడువులోగా అత్యంత కచ్చితత్వంతో పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. శనివారం సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 18, 2025
నాగాయలంక: పూడ్చిన శవానికి పోస్ట్ మార్టం.. అసలేమైంది.!

నాగాయలంక (M) నాలి గ్రామానికి చెందిన నాయుడు డానియేల్ బాబు (19) గత నెల 28న అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, డానియేల్ తల్లి ఫిర్యాదు మేరకు అవనిగడ్డ DSP విద్యాశ్రీ, తహశీల్దార్, సీఐ సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
News September 17, 2025
కృష్ణా: రైలులో గంజాయి అక్రమ రవాణా.. ఒకరి అరెస్ట్

కృష్ణా జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో, బిలాస్పూర్ నుంచి తిరుపతి వెళ్లే రైలులో 4.5 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని రామవరప్పాడు రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. నిందితుడిని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఒరిస్సాలోని చాట్ల గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి, చిత్తూరు జిల్లాలో విక్రయిస్తున్నట్లు అతడు తెలిపాడు.
News September 17, 2025
MTM: YS జగన్ ఫొటోలతో సర్టిఫికేట్లు.. ఉద్యోగులు సస్పెండ్

బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిథిలో మాజీ సీఎం జగన్ ఫొటోతో ఉన్న కుల, ఆదాయ సర్టిఫికేట్లు జారీ చేసిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పెద్దింట్లమ్మ, పంచాయతీ కార్యదర్శి రవి శంకర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.