News February 5, 2025
సీ వ్యూ పాయింట్ పనులను పరిశీలించిన కలెక్టర్

తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ బుధవారం పిచ్చాటూరు మండలంలో పర్యటించారు. పిచ్చాటూరు సమీపంలోని ఆరణీయార్ ప్రాజెక్టు వద్ద నిర్మితమవుతున్న టూరిజం సీ వ్యూ పాయింట్ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఇరిగేషన్ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
రేషన్ కార్డులు ఉన్న వారికి ఫ్రీగా క్లాత్ బ్యాగులు?

TG: వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఉన్న వారికి సన్నబియ్యంతో పాటు మల్టీ పర్పస్ క్లాత్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాగులపై ప్రభుత్వ 6 గ్యారంటీల లోగోలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా OCTలోనే ఈ బ్యాగులను పంపిణీ చేయాల్సి ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది.
News November 23, 2025
గద్వాల్: మానవత్వానికి మారుపేరు సత్యసాయి బాబా

మానవత్వానికి మారుపేరుగా సత్య సాయి బాబా నిలిచారని ఆయన సేవలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని కలెక్టర్ కార్యాలయ ఏ.ఓ.భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సత్య సాయిబాబా పుట్టినరోజు సందర్భంగా శత జయంతి ఉత్సవాలను ఆదివారం గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించారు. భగవాన్ సత్యసాయి బాబా చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళి అర్పించారు.
News November 23, 2025
HYD: జంట జలాశయాల ప్రత్యేకత ఇదే!

ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాలు నగరవాసుల దాహార్తిని తీరుస్తున్నాయి. మూసీ నది 1908లో భాగ్యనగరాన్ని వరదలతో ముంచెత్తగా.. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ వరదలకు అడ్డుకట్ట వేసేందుకు 1920-1926లో మూసీ, ఈసీ నదులపై మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికతో వంతెనలు నిర్మించారు. అప్పటి నుంచి నగరానికి తాగునీటి సరఫరా చేయడం ప్రారంభించారు.


