News August 9, 2024

సుంకిశాల ఘటనపై కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు

image

సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. సుంకిశాల ఘటనలో పొరపాటును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. సుంకిశాల ఘటనతో కృష్ణా నదిపై BRS ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యతపై విచారణ చేయిస్తామని వైరా స్నానాల లక్ష్మీపురంలో జరిగిన సమావేశంలో చెప్పారు.

Similar News

News September 8, 2024

స్వల్పంగా తగ్గుతున్న మున్నేరు వాగు

image

ఖమ్మం నగరంలో ప్రవహిస్తున్న మున్నేరు వాగు స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం మధ్యాహ్ననానికి 13.50 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. 16 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 13.75 అడుగుల వద్ద ఉన్న మున్నేరు వరద రెండు గంటలకు 13.50 అడుగులకు పడిపోయింది. స్వల్పంగా తగ్గుతుండడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

News September 8, 2024

వరదలపై రాజకీయం సరికాదు: కేంద్ర మంత్రి

image

ప్రకృతి వైపరిత్యాలు వంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలన్నారు. ఆదివారం ఖమ్మం ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అడ్వాన్స్ డిజాస్టర్ ఫండ్ కింద రూ.1,300 కోట్లు పంపిందని, వరదపై రాజకీయం చేయడం సరికాదన్నారు.

News September 8, 2024

ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి

image

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులు, రోగులకు అందిస్తున్న సేవల గురించి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.