News July 26, 2024
సుంకేసుల నుంచి 2,095 క్యూసెక్కుల నీరు విడుదల
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో.. రాజోలి శివారులో ఉన్న సుంకేసుల జలాశయం అధికారులు గురువారం ముందస్తుగా నీటిని దిగువకు విడుదల చేశారు. ఎలాంటి ఇన్ ఫ్లో నమోదు కానప్పటికీ, రెండు గేట్ల ద్వారా దిగువకు 2,095 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లుగా జేఈ రాజు తెలిపారు. డ్యాం మొత్తం నీటిమట్టం 292.00 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 290.90 మీటర్లుగా నమోదైనట్లుగా ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 29, 2024
షాద్నగర్: రైతు పండగలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా 2వ రోజు రైతు పండుగలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పద్ధతులు,లాభాదాయకమైన వ్యవసాయ పద్ధతులు, వివిధ పంట ఉత్పత్తుల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
News November 29, 2024
MBNR: రోడ్ల నిర్మాణానికై కేంద్ర మంత్రికి ఎంపీ అరుణ వినతి
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని పలు జాతీయ రహదారుల అనుసంధానం, సింగిల్ నుంచి డబుల్, డబుల్ నుంచి 4 లేన్స్, 6లేన్స్ రోడ్ల నిర్మాణానికి ప్రతి పాదనలతో ఉన్న వినతులను కేంద్రమంత్రికి అందించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపింది.
News November 29, 2024
రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా: హరీశ్ రావు
సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివాస్లో సీఎం రేవంత్ పై హరీశ్ రావు మండిపడ్డారు. ‘రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా, ఇచ్చిన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. అప్పుడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తే రేవంత్ పారిపోయిండు. రేవంత్ మీద ఉద్యమ కేసులు లేవు కానీ.. ఓటుకు నోటు కేసు మాత్రం నమోదైంది’ అని హరీశ్ రావు అన్నారు.