News August 20, 2024

సుండుపల్లె: ఎర్రచందనం స్మగ్లర్లు పరార్

image

ఎర్రచందనం అక్రమంగా తరలించేందుకు డస్టర్ వాహనంలో స్మగ్లర్లు సుండుపల్లె మీదుగా అడవిలోకి చొరబడేందుకు, ప్రయత్నాలు జరుగుతున్నాయని ముందస్తుగా సమాచారం రావడంతో వారిని పట్టుకునే ప్రయత్నంలో పరార్ అయినట్లు సానిపాయి రేంజర్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో పరారైన 6 మంది స్మగ్లర్ల వద్దనుంచి డస్టర్ వాహనం, 5 గొడ్డళ్లు, 1 రంపం, 8 చిన్న బియ్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News February 26, 2026

ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*24 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.15,730
*22 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.14,472
*వెండి 10 గ్రాముల ధర రూ.2,720 గా ఉంది.

News February 26, 2026

పులివెందుల సీఐ ఇంట్లో భారీగా నగదు

image

ఏసీబీ దాడుల్లో దొరికిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఇందులో రూ. 6 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం, 54 విదేశీయ మద్యం బాటిల్లు, విలువైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం నగదు సీఐ రెండో భార్య ఇంట్లో గుర్తించారు. ఇందులో డీఎస్పీ మురళీ నాయక్ ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News February 25, 2026

27న వైవీయూలో జాబ్ మేళా: ప్రిన్సిపల్

image

కడప YVUలో ఈ నెల 27వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొ. టి. శ్రీనివాస్ తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, వైవీయు ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 13 కంపెనీలు విశ్వవిద్యాలయానికి వస్తున్నాయన్నారు. టెన్త్ నుంచి పీజీ చదివిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 6300125455, 94405 16153 నంబర్లను సంప్రదించాలన్నారు.