News June 27, 2024
సుండుపల్లె: పింఛానదిలో పడి బాలుడి మృతి

సుండుపల్లె పింఛా ప్రాజెక్టు నదిలో ప్రమాదవశాత్తూ పడి యశ్వంత్ నాయక్(15)విద్యార్థి మృతి చెందినట్లు ఎస్సై హుస్సేన్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు పింఛాకు చెందిన మునె నాయక్ కుమారుడు యశ్వంత్ బుధవారం పింఛానదిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయి మృతి చెందాడు. పోలీసులు గురువారం మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
Similar News
News November 21, 2025
రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి కడప SP సాయం

కడపలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన AR హెడ్ కానిస్టేబుల్ నారాయణ కుటుంబానికి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ రూ.2.5 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. పోలీస్ సంక్షేమం కింద వితరణ నిధి నుంచి ఈ మొత్తాన్ని మృతుడి సతీమణి రమాదేవికి శుక్రవారం అందించారు. అంకితభావంతో పనిచేసే సిబ్బంది మరణం బాధాకరమని ఎస్పీ పేర్కొంటూ, కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
News November 21, 2025
ప్రొద్దుటూరులో బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్.!

పొద్దుటూరు పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేశారు. వారినుంచి రూ.10.56 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠాలో కీలక వ్యక్తులైన ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ధనికల వీరశంకర్, కాశినాయన మండలానికి చెందిన ఆర్ల చంద్ర యాదవ్ను శుక్రవారం డీఎస్పీ భావన ఆధ్వర్యంలో సీఐ సదాశివయ్య అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.
News November 21, 2025
కడపలో నేడు వాహనాల వేలం

కడప జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు వాహనాలు పట్టుబడ్డాయి. ఈక్రమంలో 9 వాహనాలకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నారు. కడపలోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని అధికారులు కోరారు.


