News April 15, 2025
సుందరీమణులు పాల్గొనే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు మే 14వ తేదీన వరంగల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని HNK కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. వరంగల్ పర్యటనలో భాగంగా సుందరీమణులు కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించనున్నారని, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 5, 2025
భద్రాచలం: నేటి నుంచి ఆన్లైన్లో ముక్కోటి టికెట్లు

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 30న జరిగే ఉత్తర ద్వార దర్శనాన్ని వీక్షించాలనుకునే భక్తుల సౌకర్యార్థం టికెట్లను ఆన్లైన్లో ఉంచారు. రూ.2 వేలు, రూ.వేయి, రూ.500, రూ. 250 విలువైన సెక్టార్ల టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. టికెట్లు https://bhadradritemple.telangana.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో దామోదర్ రావు తెలిపారు.
News December 5, 2025
MBNR: విద్యార్థికి వేధింపులు.. ఇద్దరు సస్పెండ్

జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థిని వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపల్ రజిని రాగమాల, వైస్ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మిని సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థిని వేధింపులకు పాల్పడిన సంఘటన ఉమ్మడి జిల్లాలో గురువారం సంచలనంగా మారింది. DSP వెంకటేశ్వర్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News December 5, 2025
వరంగల్: ఖర్చులు చూసుకుంటాం.. వచ్చి ఓటెయ్యండి..!

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఓరుగల్లు అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఉదయం 6 నుంచే గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఉపాధి కోసం వివిధ పట్టణాలకు వెళ్లిన వారికి ఫోన్లు చేసి రానుపోను ఛార్జీలతో పాటు ఖర్చులు పెట్టుకుంటామని, వచ్చి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఒక్కో ఓటు కీలకం కావడంతో ఎవరినీ వదలకుండా ఓటర్లందరినీ కవర్ చేస్తున్నారు.


