News December 11, 2024
సుకుమార్: మట్టపర్రు To పాన్ ఇండియా

పుష్ప పార్ట్-1, 2లతో పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్‌ది మన జిల్లానే. ఆయన ఉమ్మడి తూ.గో.జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు గ్రామంలో 1970లో జన్మించారు. చిన్నప్పటి నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి కనబరిచే వారు. ఉన్నత చదువులు చదివిన ఆయన మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేశారు. 2004లో ఆర్య మూవీతో డైరెక్టర్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి హిట్‌లు అందుకున్నారు. ఇప్పటివరకు ఆయన 8 సినిమాలకు దర్శకత్వం వహించారు.
Similar News
News December 16, 2025
గోపాలపురం: వెంటాడుతూనే వున్న పెద్దపులి భయం

గోపాలపురం మండలం భీమోలు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పులి ఆచూకీ కోసం కొండ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఆరు ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు కెమెరాల్లో పులి జాడలు లభించలేదని డీఎఫ్‌ఓ దావీదు రాజు సోమవారం తెలిపారు. పులి ఇంకా పరిసరాల్లోనే ఉండే అవకాశం ఉన్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
News December 15, 2025
రాజమండ్రి: పీజీఆర్‌ఎస్‌కు 23 అర్జీలు

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు 23 అర్జీలు అందాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 15, 2025
తూ.గో: రబీ యూరియా సరఫరాకు ప్రణాళిక సిద్ధం

జిల్లాలో రబీ సీజన్ (2025–26) పంటలకు అవసరమైన యూరియా సరఫరాకు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు తెలిపారు. ఈ సీజన్‌కు 58.95 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, డిసెంబర్ 1 నాటికి 3.40 వేల మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వ అందుబాటులో ఉందని సోమవారం వెల్లడించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల పంపిణీ చేపడతామని పేర్కొన్నారు.


