News July 15, 2024
సుదర్శన యాగ సహిత రుద్రయాగంలో ఎమ్మెల్యే

నార్కట్పల్లి మండలం గోపాలయపల్లి గ్రామంలో శ్రీ వారిజాల వేణు గోపాలస్వామి వారి ఆలయంలో సోమవారం సుదర్శన యాగ సహిత రుద్రయాగం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News October 24, 2025
NLG: ఆ గ్రామానికి రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం

చిట్యాల(M) ఉరుమడ్లకు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గ్రామానికి చెందిన గుత్తా మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా వ్యవహరించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా, ప్రస్తుతం మండలి ఛైర్మన్గా కొనసాగుతున్నారు. మరోవైపు, కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఉండగా, అమిత్ రెడ్డి రాష్ట్ర డైరీ ఛైర్మన్గా పనిచేస్తున్నారు. ఒకే గ్రామం నుంచి ఇంత మంది రాజకీయంగా గుర్తింపు పొందడం విశేషం.
News October 24, 2025
ప్రభుత్వం పంపిన ప్రశ్నాపత్రాలే వాడాలి: డీఈవో

నల్గొండ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ప్రభుత్వం పంపిన ప్రశ్నాపత్రాలతోనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 31 వరకు ఎస్ఏ-1 పరీక్షలను నిర్దేశించిన కాలనిర్ణయం పట్టిక ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News October 24, 2025
నల్గొండ: ఆక్యుపెన్సీ సరే.. ప్రయాణికుల రద్దీ సంగతేంది?!

నల్గొండ జిల్లాలో మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగినా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో బస్టాండ్లో నిత్యం బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అధికారులు తక్షణమే అదనపు బస్సులు నడపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


