News April 18, 2024
సుదీర్ఘ అనుభవం.. గట్టెక్కిస్తుందా..!
లోక్ సభ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. జీవన్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో 3సార్లు మంత్రిగా పనిచేశారు. ఇక ఈశ్వర్ 6 సార్లు (మేడారం నుంచి రెండు, ధర్మపురి నుంచి నాలుగు సార్లు) గెలిచి చీఫ్ విప్‌గా, మంత్రిగా పనిచేశారు. మరి ఇంత అనుభవం ఉన్న వీరివురూ ఈసారి ఎన్నికల్లో సత్తా చాటుతారా..? కామెంట్ చేయండి.
Similar News
News September 17, 2024
కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న నిమజ్జనం
మానకొండూరు, చింతకుంట కెనాల్, కొత్తపల్లి పెద్ద చెరువులో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు చేయగా, మానకొండూరులో తెల్లవారుజాము వరకు నిమజ్జనం ఉత్సవాలు జరిగాయి. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన వినాయక నిమజ్జనం ఉత్సవాలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కరీంనగర్ నియోజకవర్గం నుంచి కాకుండా తిమ్మాపూర్ మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల ప్రతిష్టించిన విగ్రహాలు మానకొండూర్ చెరువులోనే నిమజ్జనం చేశారు.
News September 17, 2024
KNR: ఒకేరోజు పోరులో 11 మంది అమరులయ్యారు!
వెట్టిచాకిరి, బానిసత్వానికి నిరసనగా పోరాటం చేసిన కమ్యూనిస్టు యోధుడు బద్దం ఎల్లారెడ్డి SRCL జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లివాసి. ఈ పోరులో గ్రామానికి చెందిన 11 మంది ఒకేరోజు అమరులయ్యారు. వీరి పేర్లతో గాలిపెల్లిలో శిలాఫలకం కూడా ఏర్పాటు చేశారు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో KNR పార్లమెంట స్థానం నుంచి ఎల్లారెడ్డి విజయం సాధించారు. 1958లో బుగ్గారం, 1972లో ఇందుర్తి నుంచి MLA అయ్యారు. 1979లో మరణించారు.
News September 17, 2024
నిమజ్జన ప్రాంతాలను పర్యవేక్షించిన KNR కలెక్టర్
మానకొండూర్, కొత్తపల్లి, చింతకుంటలో గణేశ్ నిమజ్జన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం రాత్రి పరిశీలించారు. ఇప్పటివరకు నిమజ్జనం అయిన విగ్రహాల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరం, సీసీ కెమెరాలను పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు.