News August 28, 2024

సునీతను టీడీపీలో చేర్చుకోవద్దు: MLA శిరీష

image

వైసీపీతో పాటు MLC పదవికి పోతుల సునీత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. ‘ఊసరవెల్లి లాంటి నాయకులను టీడీపీలోకి తీసుకోవద్దు. ఇలాంటి వాళ్లని పార్టీలో చేర్చుకుంటే కష్టపడిన వారిని అనుమానించినట్లే అవుతుంది. దయచేసి ఇలాంటి వారిని తీసుకోవద్దని టీడీపీ పెద్దలను కోరుతున్నట్లు ఆమె ‘X’ లో పేర్కొంది.

Similar News

News July 8, 2025

మినీ జెట్టి మంజూరు చేయాలని కేంద్రమంత్రికి వినతి

image

కేంద్ర మత్స్య శాఖ మంత్రి లాలన్ సింగ్‌ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం దిల్లీలో కలిశారు. పెద్ద గనగలవానిపేట వద్ద మినీ జెట్టి నిర్మాణానికి, ఫిష్ లాండింగ్ సెంటర్ మంజూరు చేయాలని కోరారు. మంత్రి అచ్చెంనాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి వినత పత్రం అందజేయడం జరిగిందని శంకర్ తెలిపారు.

News July 8, 2025

శ్రీకాకుళం: హోంగార్డుకు ‘చేయూత’

image

ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు పి. జగన్నాధంకు ‘చేయూత”ను అందించేందుకు హెూంగార్డు సిబ్బంది స్వచ్ఛంధగా విరాళం ఇచ్చిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు నగదు చెక్కు రూ.4.09 లక్షలను ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో అందజేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు.

News July 8, 2025

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన అచ్చెన్నాయుడు

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో ఆయన కార్యాలయానికి వెళ్లి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఆయనను అచ్చెన్న కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.