News August 7, 2024

సున్నిపెంట పంచాయతీకి కేటాయించిన 208.74 ఎకరాల భూమి రద్దు: మంత్రి

image

శ్రీశైలం మండల కేంద్రమైన సున్నిపెంట గ్రామపంచాయతీకి గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన జల వనరుల శాఖ ఆధీనంలోని 208.74 ఎకరాల భూమిని రద్దు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ మేరకు మంత్రి పార్థసారథి వివరాలు వెల్లడిస్తూ రద్దయిన భూమిని తిరిగి జల వనరుల శాఖకు కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదించినట్లు పేర్కొన్నారు. ఆ భూమిని శ్రీశైలం ప్రాంత అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్‌కు వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News September 11, 2024

కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయాలి: కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ది శాఖ అమలు చేస్తున్న పథకాలు జిల్లాలో సక్రమంగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పనుల పురోగతిపై ఎంపీ శబరికి నివేదిక రూపంలో అందజేసి కేంద్రం ద్వారా పెండింగ్ నిధులు రాబట్టేందుకు సహకరించాలన్నారు.

News September 11, 2024

సోదర భావంతో పండుగలను జరుపుకోవాలి: ఎస్పీ

image

జిల్లా పోలీసు కార్యాలయంలోలో ఈ నెల 15న వినాయక నిమజ్జనం, 16న మిలాద్ ఉన్ నబీ పండుగలను పురస్కరించుకుని శాంతియుత సమావేశం మంగళవారం నిర్వహించారు. కర్నూలులోని వివిధ వర్గాలకు చెందిన సామాజిక మత పెద్దలు, జిల్లాస్థాయి అధికారులతో ఎస్పీ మాట్లాడారు. జిల్లా మతసామరస్యంలో ఆదర్శంగా, స్పూర్తిగా ఉండాలన్నారు. వినాయక నిమజ్జన ఉత్సవం ప్రశాంతంగా జరుగుతుందన్నారు. కుల, మతాలకు అతీతంగా కలిసి మెలిసి పండుగలు జరుపుకోవాలన్నారు.

News September 10, 2024

కర్నూలు జిల్లా టీడీపీ తరఫున వరద బాధితులకు సహాయం

image

కర్నూలు జిల్లా టీడీపీ తరఫున వరద బాధితులకు రూ.1.50 కోట్ల విలువ చేసే నిత్యవసరాల సరుకులను విరాళంగా ఇచ్చారు. ఇవి దాదాపు 10 వేల కిట్లు ఉంటాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ఈ నిత్యావసరాల సరుకులను తీసుకెళ్తున్న వాహనాలను కలెక్టర్ రంజిత్ బాషా జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు.