News November 10, 2024
సుప్రసిద్ధ కేంద్రంగా కురుమూర్తిని మారుస్తాం: సీఎం
ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కురుమూర్తి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. చరిత్రలోనే తొలిసారిగా కురుమూర్తి దేవస్థానానికి ముఖ్యమంత్రి రావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. రానున్న రోజుల్లో కురుమూర్తి దేవస్థానాని దేశంలో సుప్రసిద్ధ పర్యటక కేంద్రంగా తయారవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Similar News
News December 13, 2024
వనపర్తి: కొడుకు మందలించాడని తల్లి సూసైడ్
కొడుకు మందలించాడన్న మనస్తాపంతో తల్లి సూసైడ్ చేసుకున్న వనపర్తి జిల్లాలో జరిగింది. SI సురేశ్ గౌడ్ తెలిపిన వివరాలు.. ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటకు చెందిన కాశమ్మ(68) తరచుగా కల్లు తాగుతుండడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈదే విషయంలో గురువారం మరోసారి గొడవ పడగా కాశమ్మ ఇంట్లోంచి వెళ్లిపోగా గ్రామ శివారులోని చెరువులో డెడ్‌బాడీ దొరికింది.ఆమె కొడుకు శ్రీను ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 13, 2024
పాలమూరుకు మంత్రి పదవి దక్కేనా..?
త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రస్తుతం కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి ఒక్కరే మంత్రిగా ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. ఈ క్రమంలో పాలమూరు నుంచి పలువురి మంత్రి పదవి అని గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి బెర్తు దక్కుతుందా..? కామెంట్ చేయండి
News December 13, 2024
గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ సంతోష్
15, 16 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణ పై ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. 2 రోజులు, రోజుకు 2 దఫాలుగా పరీక్షలు ఉంటాయన్నారు. ఉదయం 10:00 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 3:00 నుంచి 5: 30 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో 25 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.