News August 17, 2024

సుప్రీంకోర్టు జడ్జిని కలిసిన రెండు జిల్లాల కలెక్టర్లు

image

అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేకే మహేశ్వరిని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణణ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల స్థితిగతులను గురించి జడ్జికి వివరించారు.

Similar News

News December 9, 2025

విశాఖలో టెట్ పరీక్షలు.. అభ్యర్థులకు డీఈవో కీలక సూచనలు

image

విశాఖ జిల్లాలో AP TET-2025 పరీక్షలు డిసెంబర్ 10 నుంచి 21 వరకు 12 కేంద్రాల్లో ఆన్‌లైన్ (CBT) విధానంలో జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పక తీసుకురావాలని, పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందే సెంటర్‌కు చేరుకోవాలని ఆయన సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని స్పష్టం చేశారు.

News December 9, 2025

విశాఖ: పలు రైళ్లు రద్దు.. మరికొన్ని కుదింపు

image

భద్రతా పనుల కారణంగా కేకే లైన్‌లో పలు రైళ్లను నియంత్రిస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం పవన్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 9, 10వ తేదీల్లో విశాఖ-కిరండూల్, హీరాఖండ్, రూర్కెలా ఎక్స్‌ప్రెస్‌ కోరాపుట్ లేదా దంతెవాడ వరకే నడుస్తాయి. అదేవిధంగా డిసెంబర్ 13, 15వ తేదీల్లో విశాఖ-కిరండూల్ పాసింజర్ రైలు విశాఖపట్నం-కోరాపుట్ మధ్య రద్దు చేయబడింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలి.

News December 9, 2025

విద్యార్థుల్లో నైపుణ్యాల కోసమే బాలోత్సవాలు: విశాఖ DEO

image

విశాఖ బాలోత్సవం సెయింట్ ఆంథోనీ స్కూల్‌లో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా విద్యాధికారి ఎన్.ప్రేమ్ కుమార్ దీనిని ప్రారంభించగా.. రోటరీ గవర్నర్ డా.వై.కళ్యాణ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో మంచి మార్పు వస్తుందని వక్తలు పేర్కొన్నారు. మొదటి రోజు వివిధ విభాగాల్లో 27 అంశాలపై పోటీలు నిర్వహించారు.