News August 1, 2024
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: RS ప్రవీణ్
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని BRS నాయకులు RS ప్రవీణ్ కుమార్ అన్నారు. దశాబ్దాలుగా వెనకకు నెట్టివేయబడ్డ ఎన్నో పేద కులాలకు ఈ చరిత్రాత్మక తీర్పుతో ఇప్పుడైనా కొంత న్యాయం జరుగుతుందని ఆశిద్దామని ట్వీట్ చేశారు. ప్రభుత్వ రంగంలో అవకాశాలు సన్నగిల్లుతున్న ఈ తరుణంలో ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లను ప్రవేశపెడితే పేద వర్గాల సంపూర్ణ అభివృద్ది సాధ్యమవుతుందన్నారు.
Similar News
News December 13, 2024
పాలమూరుకు మంత్రి పదవి దక్కేనా..?
త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రస్తుతం కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి ఒక్కరే మంత్రిగా ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. ఈ క్రమంలో పాలమూరు నుంచి పలువురి మంత్రి పదవి అని గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి బెర్తు దక్కుతుందా..? కామెంట్ చేయండి
News December 13, 2024
గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ సంతోష్
15, 16 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణ పై ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. 2 రోజులు, రోజుకు 2 దఫాలుగా పరీక్షలు ఉంటాయన్నారు. ఉదయం 10:00 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 3:00 నుంచి 5: 30 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో 25 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
News December 13, 2024
ఉమ్మడి జిల్లాలోని నేటి..TOP NEWS!
❤MBNR: రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
❤సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జితేందర్ రెడ్డి
❤అయిజ: Way2News ఎఫెక్ట్.. నిత్యవసర సరుకులు అందజేత
❤లగచర్ల రైతు చేతికి బేడీలు.. KTR అభ్యంతరం
❤14న లోక్ అదాలత్
❤NGKL:రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
❤లగచర్ల కేసు నాంపల్లి కోర్టుకు బదిలీ
❤గ్రూప్-2 పరీక్ష.. నిర్వహణపై ప్రత్యేకంగా నిఘా
❤GDWL:రేపు జాబ్ మేళా
❤కొనసాగుతున్న సీఎం కప్పు క్రీడలు
❤ముగిసిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీ