News April 7, 2025

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుగు ప్రయాణం

image

తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన సంజీవ్ ఖన్యా తిరుగు ప్రయాణమయ్యారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం భన్సల్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు జ్ఞాపికలను అందజేసి వీడ్కోలు పలికారు. పర్యటనకు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 22, 2025

HNK: బావ ఇంటికి బావమరిది కన్నం

image

బావ ఇంట్లో దొంగతనం చేసిన బావమరిదిని HNK జిల్లా మడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఐలవేని సాయి రోహిత్‌ (26)ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆరు నెలల కిందట బావ బూతగడ్డ సతీష్‌ ఇంట్లో దొంగతనం చేసినట్టు ఒప్పుకొన్నాడు. అతడి వద్ద నుంచి రూ. 4.36 లక్షల విలువైన 47.05 గ్రా. బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పుల్యాల కిషన్ తెలిపారు.

News November 22, 2025

సిద్దిపేట: పెళ్లి కావట్లేదని అమ్మాయి చనిపోయింది..!

image

ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట(D) మద్దూర్(M) రేబర్తి వాసి కుంటి నిరోష(32) సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది. చింతల్ పద్మానగర్‌లో తన సోదరుడు నరేశ్‌తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పెళ్లి కావట్లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.

News November 22, 2025

WGL సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వ్యయం పెంపులో అక్రమాలు?

image

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అంచనా వ్యయం భారీగా పెంచినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్ధారించింది. అనుమతులు లేకుండా గత ప్రభుత్వం మౌఖిక ఆదేశాలతో వ్యయాన్ని రూ.625 కోట్లకు పైగా పెంచినట్టు నివేదికలో తేలింది. ఇదే సమయంలో ఆస్పత్రి భూ అక్రమాలు, జైలు భూముల తాకట్టు అంశాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ఫోరెన్సిక్ నివేదిక వచ్చినా.. విజిలెన్స్ నివేదిక పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వం చర్యలను నిలిపివేసింది.