News April 4, 2025
సుప్రీం కోర్టుకు వందనాలు: ఆర్ఎస్పీ

గచ్చిబౌలిలో ‘వనమేధాన్ని’ అడ్డుకున్న సుప్రీం కోర్టుకు వందనాలు అంటూ పాలమూరు BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Xలో ట్వీట్ చేశారు. HCU విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. అబద్ధాల ఆక్సిజన్‌తో, పోలీసుల పహారాలో, ప్రజల నుంచి దూరంగా తమ బంగళాల్లో సేద తీరుతున్న రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి, కొండా సురేఖ తదితరులు వెంటనే రాజీనామా చేయాలన్నారు.
Similar News
News October 17, 2025
MBNR: రూ.100 కోట్ల ‘PM–USHA’ పనులు వేగవంతం- VC

పీయూలో ఇంజినీరింగ్ కళాశాల,లా కళాశాల, కొత్త హాస్టళ్లు, పరిశోధన కేంద్రాలు వంటి ప్రాజెక్టులు రూ.100 కోట్ల PM–USHA పథకం కింద వేగంగా అభివృద్ధి చెందుతుందని వీసీ ఆచార్య డాక్టర్ జిఎన్.శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఐదు క్యాంపస్ కళాశాలలు, 3 పీజీ సెంటర్లు, 24 కోర్సులు కొనసాగుతున్నాయని, NSS, క్రీడా, పర్యావరణ, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థుల చురుకైన భాగస్వామ్యాన్ని’ ప్రశంసించారు.
News October 17, 2025
బీబీనగర్ ఎయిమ్స్.. సీఎంకు దత్తాత్రేయ లేఖ

బీబీనగర్‌లోని ఎయిమ్స్ క్యాంపస్‌ను రవాణా, ఇతర మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇది ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతి అని, తెలంగాణలో వైద్య సేవలను బలోపేతం చేయడానికి ఎయిమ్స్ అభివృద్ధి అత్యవసరమన్నారు. రాజకీయాలకు అతీతంగా, సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు.
News October 17, 2025
పొగమంచు.. వాహనాలు నడిపే వారు జాగ్రత్త!

తెలుగు రాష్ట్రాల్లో చలికాలం మొదలైంది. చాలాచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా, కొన్నిచోట్ల పొగమంచు ఏర్పడుతోంది. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కార్లు, బైకులు, ఇతర వాహనాలు నడిపేవారు ఈ సమయంలో నిదానంగా వెళ్లడం మేలు. అలాగే పాటు ఫాగ్‌లైట్స్, బీమ్ హెడ్‌లైట్స్ ఉపయోగించాలని, ఓవర్టేక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.