News September 7, 2024
సుభాన్‌ను అభినందించిన అసదుద్దీన్ ఓవైసీ

ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు వంతెనపై ఇటీవల జరిగిన వరదల్లో చిక్కుకున్న 9 మంది ప్రాణాలు సుభాన్ జేసీబీ సహాయంతో కాపాడిన విషయం తెలిసిందే. శనివారం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ధైర్యసాహసాలను మెచ్చుకొని అభినందించారు. అతనికి రూ.51,000 నగదు ఇచ్చి సత్కరించారు. ఖమ్మంలో డబల్ బెడ్రూమ్ కోసం సీఎం రేవంత్ రెడ్డికి సిఫార్సు చేశారు.
Similar News
News December 9, 2025
ఖమ్మం: వెంకటరెడ్డి ప్రస్థానం ఆదర్శనీయం

సర్పంచ్ ఎన్నికల వేళ దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానం నేటి అభ్యర్థులకు ఆదర్శనీయం. పాత లింగాల సర్పంచ్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన, 1977లో ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. సర్పంచ్‌గా పదేళ్లు పనిచేసి, తర్వాత ఎమ్మెల్యే, మంత్రి స్థాయికి ఎదిగారు. గ్రామాభివృద్ధికి నిబద్ధత ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని ఆయన నిరూపించారు.
News December 9, 2025
విదేశీ విద్యకు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ చేయూత

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఖమ్మంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన IELTS ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీలత తెలిపారు. శిక్షణతో పాటు స్కాలర్షిప్ పొందేలా మార్గనిర్దేశం చేస్తామని చెప్పారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 21వ తేదీలోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
News December 9, 2025
ఖమ్మం జిల్లాలో పడిపోయిన టెంపరేచర్

రెండు రోజులుగా వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 15 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు, చల్లని గాలుల ప్రభావం కనిపించింది. ఈ చలి కారణంగా ప్రజలు జలుబు, గొంతు నొప్పితో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.


