News February 2, 2025
సురారంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి SUICIDE

సూరారం PS పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల.. చిత్తూరు జిల్లాకు చెందిన తేజ్ స్వరూప్‌రెడ్డి (32), తన భార్య నాగలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి కృష్ణమాలక్ష్మి నగర్లో అద్దెకు ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామన్నారు.
Similar News
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. భువనగిరి జిల్లాకు ఇవి కావాలి..?

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భువనగిరి జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. చిన్నేటి వాగులపై చెక్ డ్యాంల నిర్మాణం, భువనగిరిలో ఐటీ హబ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు, భువనగిరి మెడికల్ కళాశాలకు ప్లేస్ కేటాయింపు, రోడ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించాలంటున్నారు.
News March 12, 2025
పాకిస్థాన్ క్రికెట్ ICUలో ఉంది: అఫ్రీది

సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పాకిస్థాన్ క్రికెట్ ఇప్పుడు ICUలో ఉందని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నారు. ‘PCB నిర్ణయాల్లో కంటిన్యుటీ, కన్సిస్టెన్సీ ఉండట్లేదు. తరచుగా కెప్టెన్, కోచ్‌లను మారుస్తున్నారు. కోచ్‌లు ప్లేయర్లను నిందించడం, మేనేజ్మెంట్ స్టాఫ్ తమ పదవుల్ని కాపాడుకునేందుకు కోచ్‌లు, ఆటగాళ్లను నిందించడం విచారకరం’ అని బోర్డు పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. కరీంనగర్‌కు ఏం కావాలంటే..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని, వేసవిలో సాగు, తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. కల్వల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఇతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.