News April 24, 2024
సురేశ్ షెట్కార్ ఆస్తులు.. 3.5కిలోల బంగారం, 60 ఎకరాల భూమి

జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తన కుటుంబ ఆస్తులు రూ.10.77కోట్లగా ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. చరాస్తుల విలువ రూ. 3.20 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.7.57 కోట్లు. ప్రైమ్ ఫుడ్ టెక్ ప్రై.లిమిటెడ్లో రూ.20 లక్షల విలువైన షేర్లు, ఆయన సతీమణి పేరిట 3.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఖేడ్, సంగారెడ్డిలో కలిపి 60.08 ఎకరాల వ్యవసాయ, ఖేడ్లో అర ఎకరా వ్యవసాయేతర భూమి, 2 ఇళ్లు ఉన్నాయి.
Similar News
News November 24, 2025
మెదక్: ప్రజావాణిలో ప్రజల సమస్యలు విన్న ఎస్పీ

మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను వారు నేరుగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు విన్నవించారు. ఎస్పీ ప్రతి ఫిర్యాదు దారునితో వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్యలపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News November 24, 2025
మెదక్: రిజర్వేషన్ల ఖరారు.. గ్రామాల్లో వేడెక్కనున్న రాజకీయం

ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సంకల్పించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. గత నెలల్లో ప్రభుత్వం 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని చూసి ఆ దిశగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికల నోటిఫికేషన్ జారి చేసింది. అనూహ్యంగా హైకోర్టు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని తెలపడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఉపసంహరించుకుంది.
News November 24, 2025
మెదక్ జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అసీమ్ బిన్ అబ్దుల్లా

మెదక్ జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్న శంకరంపేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అసీమ్ బిన్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. మొత్తం 54 ఓట్లు పోలవ్వగా ఆసీమ్ బిన్ అబ్దుల్లాకు 41 ఓట్లు, గీత అగర్వాల్ 13 ఓట్లు వచ్చాయి.
ఈ ఎన్నికలను స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించగా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేసన్న ఎన్నికల అధికారిగా వ్యవహారించారు.


