News April 24, 2024

సురేశ్‌ షేట్కార్‌ ఆస్తుల వివరాలు

image

జహీరాబాద్ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ షేట్కార్‌ తన కుటుంబ ఆస్తులు రూ.10.77కోట్లగా ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. చరాస్తుల విలువ రూ.3.20 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.7.57 కోట్లు, ప్రైమ్‌ ఫుడ్‌ టెక్‌ ప్రై.లిమిటెడ్‌లో రూ.20 లక్షల విలువైన షేర్లు, ఆయన సతీమణి పేరిట 3.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఖేడ్‌, సంగారెడ్డిలో కలిపి 60.08 ఎకరాల వ్యవసాయ, అర ఎకరా వ్యవసాయేతర భూమి, 2 ఇళ్లు ఉన్నాయి.

Similar News

News January 5, 2026

నిజామాబాద్: సంక్రాంతి ప్రయాణమా.. జాగ్రత్తలు తప్పనిసరి!

image

సంక్రాంతి సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నగలు, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, ఇంటికి బలమైన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడాలని చెప్పారు. ​ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఇంటిని పర్యవేక్షించాలన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే ‘డయల్ 100’కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు.

News January 5, 2026

NZB: చైనా మంజాతో ప్రాణహాని జరిగితే హత్య కేసు: సీపీ

image

చైనా మాంజా వాడకంపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మాంజా వల్ల ఎవరికైనా ప్రాణహాని కలిగితే బాధ్యులపై ‘హత్యా నేరం’ (Murder Case) కింద కేసు నమోదు చేస్తామన్నారు. మాంజా విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరి వద్దనైనా మాంజా ఉంటే పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని, విక్రయించే వారి గురించి తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.