News March 10, 2025
సుల్తానాబాద్: ఈతకు వెళ్లి బాలుడి మృతి

కాట్నపల్లిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లగా ఒకరు మృతిచెందాడు. మోరపెల్లి అవినాశ్ రెడ్డి(15) ఆదివారం తన స్నేహితుడు సూర్యవంశీతో కలిసి ఈత కొట్టడానికి వెళ్లారు. అవినాశ్ బావిలో దిగగా వెంటనే మునిగిపోవడం చూసిన సూర్యవంశీ పరిగెత్తుకుని వెళ్లి బంధువులతో బావి దగ్గరికి వచ్చాడు. బాలుడిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News October 28, 2025
NLG: శిశు విక్రయ ఘటనపై సీరియస్… కేసు నమోదు

నల్గొండ జిల్లాలో శిశు విక్రయం ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. శిశువును అమ్మిన తల్లిదండ్రులు బాబు, పార్వతితో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులు, మధ్య దళారులుగా వ్యవహరించిన వారిపై కేసు నమోదు చేయాలని నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News October 28, 2025
VZM: రేపటి జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా

మొంథా తుఫాన్ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో బి. సత్యనారాయణ మంగళవారం తెలిపారు. తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. సభ్యులు, అధికారులు దీనిని గమనించాలని సూచించారు.
News October 28, 2025
‘భారత్’ అనే శబ్దానికి అర్థమిదే..

‘భా’ అంటే జ్ఞానం. ‘ర’ అంటే ఆనందించడం. ‘త’ అంటే తరింపజేయడం. జ్ఞాన మార్గంలో ఆనందంగా ఉంటూ ఇతరులను కూడా తరింపజేసేవాడే భారతీయుడు అని దీనర్థం. అందుకే ఇది కర్మభూమిగానూ ప్రసిద్ధి చెందింది. అంటే.. ఇక్కడ మన కర్మల ద్వారా మోక్షాన్ని, ముక్తిని సాధించుకోవచ్చని అంటారు. భారతదేశం ఆత్మజ్ఞానాన్ని, తత్వ వివేకాన్ని పొందేందుకు, జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అత్యంత అనువైన, పవిత్రమైన దేశంగా పరిగణిస్తారు. <<-se>>#Sanathana<<>>


