News February 10, 2025
సుల్తానాబాద్: రైలు ఢీకొని వ్యక్తి మృతి

సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతిచెందాడు. మృతదేహం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రామగుండం మార్చురీలో ఉందని ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి.తిరుపతి తెలిపారు. వివరాలు తెలిస్తే 9949304574, 8712658604 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
Similar News
News February 9, 2026
ఎన్నికలకు సిద్ధం.. సిబ్బంది ఖరారు: కలెక్టర్

జిల్లాలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియలో కీలకమైన చివరి విడత ర్యాండమైజేషన్ సోమవారం కలెక్టరేట్‌లో పూర్తయింది. ఎన్నికల సాధారణ పరిశీలకులు రమేష్ సమక్షంలో కలెక్టర్ చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. NLG కార్పొరేషన్ సహా MLG, నందికొండ, హలియా, DVK, చండూరు, చిట్యాల పురపాలక సంఘాల్లో 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News February 9, 2026
500 ఎకరాల్లో ఇల్లు.. ఎక్కడుందో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద ఇళ్లలో ఒకటిగా పేరొందిన లక్ష్మీవిలాస్ ప్యాలెస్ వడోదరాలో (GJ) ఉంది. 19వ శతాబ్దం చివరలో గైక్వాడ్ రాజకుటుంబం కోసం బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ చిసోమ్ దీనిని డిజైన్ చేశారు. 500 ఎకరాలకు పైగా ఉండే ఈ ప్యాలెస్‌లో మ్యూజియంలు, గార్డెన్లు, రవి వర్మ పెయింటింగ్స్, గోల్ఫ్ క్లబ్ ఉన్నాయి. ఇందులో ఇప్పటికీ రాజకుటుంబీకులు నివసిస్తున్నప్పటికీ పబ్లిక్ దీనిని చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
News February 9, 2026
KMR: డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు ఉ.8 గంటలకు చేరుకోవాలి

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఇతర పోలింగ్ అధికారులు మంగళవారం ఉదయం 8గం.లకు సంబంధిత డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా ఎన్నికల సమన్వయకర్త రాజు తెలిపారు. బిచ్కుంద-మార్కెట్ యార్డ్, ఎల్లారెడ్డి-ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాన్సువాడ-ఎస్ఆర్ఎన్‌కే డిగ్రీ కళాశాల, కామారెడ్డి-AMC గోదాంకు చేరుకోవాలన్నారు.


