News April 10, 2025
సుస్థిర అభివృద్ధిలో ఎల్లారెడ్డిపేటకి 22వ ర్యాంకు

ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ 79.37 మార్కులతో రాష్ట్రంలో 22వ ర్యాంకు సాధించింది. అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ.. పంచాయతీలలో మౌలిక వసతుల పెంపు కోసం, ప్రజల సౌకర్యాలు కల్పన కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో తాను పనిచేసే ఎల్లారెడ్డిపేట రాష్ట్రంలో 22వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు.
Similar News
News November 18, 2025
శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానం

సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాద ఘటన బాధితుల కోసం ప్రభుత్వం శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని గుర్తించి, అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మృతుల రక్త సంబంధికులను ఈరోజు రాత్రి 8.30 గంటలకు నాంపల్లి హజ్ హౌస్ నుంచి సౌదీకి పంపనున్నారు.
News November 18, 2025
పరకామణి చోరీ కేసుపై TTD బోర్డు కీలక నిర్ణయం

తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ ఏర్పాటు చేసిన సమావేశంలో మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పరకామణి చోరీలో గతంలో నమోదైన కేసులో పరిమితులు ఉన్నాయని కేసులో రాజీ వెనుక ఉన్న వారిని తేల్చేందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో మరోసారి కేసు నమోదు చేయాలని తీర్మానించారు.
News November 18, 2025
NRPT: రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వాలని వినతి

వరి ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తెచ్చేందుకు గన్ని బ్యాగులు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో నేతలు మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ను కలిసి వినతిపత్రం అందించారు. జిల్లా కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ.. రైతులకు గన్ని బ్యాగులు లేక ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.


