News March 25, 2025

‘సూపర్’ తరహాలో దొంగతనాలు చేస్తున్న కుర్రాడి అరెస్ట్

image

‘సూపర్’ సినిమాలో మాదిరి పార్కింగ్ చేసిన కార్ల అద్దాన్ని పగలగొట్టి అందులో ఉన్న డబ్బు, మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులను చోరీ చేసే వ్యక్తిని తిరుమల 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో శ్రీకాళహస్తికి చెందిన కే.హేమ చంద్రారెడ్డి (35)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.60 వేలు, కారు, బంగారు కమ్మలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Similar News

News October 19, 2025

కృష్ణా: కార్తీకమాసానికి ఆలయాలు ముస్తాబు

image

కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. హిందువులు నియమనిష్టలతో ఆచరించే ఈ మాసంలో ప్రత్యేక పూజలు, దీపారాధనలకు ఆలయ నిర్వాహకులు సర్వసన్నద్ధమవుతున్నారు. కార్తీకంలో శివాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల సూచన.

News October 19, 2025

పెనుగంచిప్రోలు: లొంగిపోయిన చిట్టీల వ్యాపారి

image

పెనుగంచిప్రోలులో గత వారం రోజుల క్రితం సుమారు రూ.5 కోట్లతో పరారైన చిట్టీల వ్యాపారి చిన్న దుర్గారావు ఆదివారం సీఐ కార్యాలయంలో లొంగిపోయారని జగ్గయ్యపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గోల్డ్ స్కీమ్, చిట్టీల పేరుతో మోసాలు చేసి దుర్గారావు పారిపోగా, ఎస్సై అర్జున్ ఆధ్వర్యంలో మూడు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

News October 19, 2025

ఏలూరులో ఒకరు సూసైడ్

image

కరెంటు వైరుతో ఓ వ్యక్తి ఆత్మహత్య చెసుకున్న ఘటన ఆదివారం ఏలూరులోని వంగాయగూడెంలో జరిగింది. మృతుడు వంగయాగూడెంనకు చెందిన చంద్రమౌళి(32) సెంట్రింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగించేవాడిని స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.