News August 7, 2024

సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ బాబు: మాజీ ఎమ్మెల్యే RRR

image

రాష్ట్ర ప్రజలకు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాయచోటిలోని తన కార్యాలయంలో బుధవారం రమేశ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టి పథకాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు.

Similar News

News November 23, 2025

సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లిన కడప జట్టు

image

69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌ బాల్ అండర్-14 పోటీల్లో కడప జిల్లా బాలురు, బాలికల జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బాలురు గోదావరి జట్టును, బాలికలు కృష్ణా జట్టును ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టాయి. అలాగే ప్రకాశం, అనంతపురం, ఈస్ట్ గోదావరి, విజయనగరం బాలికల జట్లు కూడా సెమీఫైనల్‌కు చేరాయి. బాలుర విభాగంలో విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి జట్లు సెమీస్‌లో ప్రవేశించాయి. రేపు ఉదయం సెమీఫైనల్స్ జరగనున్నాయి.

News November 23, 2025

మైదుకూరు: గౌడౌన్‌లలో నిల్వ ఉన్న 6858.45 కేజీల స్టీల్‌పై అనుమానాలు

image

మైదుకూరు హౌసింగ్ శాఖకు సంబంధించిన స్టీలు నిల్వల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి నెలలో 6858.45 కేజీల స్టీలు పంపిణీలో అవినీతి చోటు చేసుకున్నట్లు అధికారులకు నివేదికలు వెళ్లాయి. అయితే విచారణకు అధికారులు వచ్చే లోపు స్టీలు అందుబాటులో ఉంచారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశంపై తిరిగి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుతం నిల్వ ఉన్న స్టీలు గతంలో సరఫరా చేసిందా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.

News November 23, 2025

ప్రొద్దుటూరులో అప్పులోళ్ల ఆందోళన..!

image

ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి శ్రీనివాసులు కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఆభరణాల తయారీకి ఆర్డర్లు ఇచ్చామని పలువురు చెప్పుకొచ్చారు. అడ్వాన్స్‌లు కూడా ఇచ్చామని, ఇతను పెద్ద మొత్తంలో చీటీలు నిర్వహిస్తున్నాడని తెలిపారు. దాదాపు రూ.10 కోట్ల వరకు ఉంటుందని బాధితులు వాపోతున్నారు. ఆయన జైలుకు పోతే తమ డబ్బులు రావేమోనని భయపడిపోతున్నారు. తమ డబ్బులు కూడా పోలీసులే వసూలు చేయించాలని కోరుతున్నారు.