News April 2, 2025
సూర్యపేట: ప్రతి బుధవారం పోలీస్ శాఖ ప్రజా భరోసా

గ్రామాల్లో శాంతి భద్రతలు పటిష్టం చేసి ప్రజలకు ప్రశాంతమైన జీవనం గడిపేందుకు పోలీస్ శాఖ ప్రజా భరోసా కార్యక్రమాన్ని ప్రతి బుధవారం నిర్వహిస్తుందని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో గుర్తించిన సమస్యాత్మక గ్రామాల్లో ప్రతి బుధవారం సమావేశం నిర్వహించి సమస్యలు సృష్టించే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు.
Similar News
News November 23, 2025
అతిగా స్క్రీన్ చూస్తే ఆలస్యంగా మాటలు!

పిల్లలను అతిగా స్క్రీన్(TV, ఫోన్) చూసేందుకు అలవాటు చేస్తే వారి భవిష్యత్తుకు ప్రమాదమని అంతర్జాతీయ సర్వే హెచ్చరిస్తోంది. చిన్నవయసులో(1-5 ఏళ్లు) ఎక్కువగా స్క్రీన్ చూసే పిల్లలకు మాటలు రావడం ఆలస్యమవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అటు కొత్త పదాలు నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుందని పేర్కొంది. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని, తప్పనిసరైతే నాలెడ్జ్ పెంచే వీడియోలను సూచించాలని చెబుతోంది.
News November 23, 2025
వనపర్తి: శిక్షకులు లేక విద్యార్థుల ఇబ్బందులు

వనపర్తి జిల్లాలో మొత్తం 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కొన్ని కళాశాలలో క్రీడా మైదానాలు అందుబాటులో ఉన్నా.. శిక్షకులు లేకపోవడంతో విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించలేకపోతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో శిక్షకులు అందుబాటులో లేరు. దీంతో చాలామంది విద్యార్థులు ఆసక్తి ఉన్నా క్రీడలకు దూరమవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శిక్షకులను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.
News November 23, 2025
మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్

తెలంగాణ మంత్రులు, పలు శాఖల అధికారిక వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. SBI ఆధార్ అప్డేట్ పేరుతో ప్రమాదకర APK ఫైల్స్ షేర్ అయ్యాయి. ఆ ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అప్పటికే ఓపెన్ చేసిన పలువురు జర్నలిస్టులు.. తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు చేస్తున్నారు.


