News February 7, 2025
సూర్యపేట: మహిళ హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

మహిళ హత్య కేసులో ఓ వ్యక్తికి NLG జిల్లా 2వ అదనపు కోర్టు జడ్జి రోజారమణి గురువారం జీవిత ఖైదు విధించారు. చివ్వెల(M)కి చెందిన విజయకు కర్నూలు జిల్లాకు చెందిన మూజువర్ నూర్ మహ్మద్‌తో పరిచయమైంది. వారు కొంతకాలం సహజీవనం చేయగా ఆమెకు వేరొకరితో సంబంధం ఉందని అనుమానించిన మహ్మద్ 2014జూన్6న కనగల్(M) పర్వతగిరి వద్ద ఆమెను హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హజరుపర్చగా జడ్జి అతడికి శిక్ష విధించారు.
Similar News
News March 24, 2025
నిర్మల్‌లో BJP X కాంగ్రెస్

నిర్మల్ జిల్లాలో రాజకీయాలు BJP X కాంగ్రెస్ అన్నట్లే నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 3 నియోజకవర్గాల్లో BRSఓటమి పాలైంది. నిర్మల్, ముధోల్ మాజీ MLAలు IKరెడ్డి, విఠల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీకి పట్టుపెరిగింది. 2MLA స్థానాలను కైవసం చేసుకున్న BJP బలంగా ఉంది. ఖానాపూర్‌లో కాంగ్రెస్MLA బొజ్జు ప్రజల్లోకి వెళ్తుండగా BRSఇన్‌ఛార్జ్ జాన్సన్‌నాయక్ అప్పుడప్పుడే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
News March 24, 2025
MBNR: సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నాను: మాజీ ఎంపీ

10,950 జీపీవో పోస్టులను నియమించినందుకు, వీఆర్వో, వీఆర్ఎల్‌ను కూడా క్రమబద్ధీకరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. అలాగే కోచ్‌ల పోస్టులను క్రమబద్ధీకరించడం, కొత్త కోచ్‌ల నియామకం కూడా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి వేస్తారని ఆశిస్తున్నానన్నారు.
News March 24, 2025
HYD MMTSలో యువతిపై అత్యాచారయత్నం

సికింద్రాబాద్ TO మేడ్చల్ MMTSలో ఓ యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించగా.. కదులుతున్న ట్రెయిన్‌లో నుంచి ఆ యువతి దూకేసింది. తీవ్రగాయాలైన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.