News May 18, 2024
సూర్యలంక బీచ్‌లో వైసీపీ అభ్యర్థి నూరిఫాతిమా
మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన రాజకీయ నేతలు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నూరిఫాతిమా ఎన్నికల ప్రచారం తనదైన శైలిలో నిర్వహించారు. పోలింగ్ అయిపోగా, శనివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో సేదదీరారు.
Similar News
News December 6, 2024
విడదల రజినిపై పోలీసులకు ఫిర్యాదు
మాజీ మంత్రి విడదల రజిని దళిత రైతుల భూములు లాక్కున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈక్రమంలో యడవల్లికి చెందిన దళిత రైతులు చిలకలూరిపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి విడదల రజిని తమను మభ్యపెట్టి విలువైన గ్రానైట్ ఉన్న తమ భూములను లాక్కున్నారని వాపోయారు. వారిద్దరిపై కేసు నమోదు చేయాలని కోరారు.
News December 6, 2024
తెనాలిని జిల్లా కేంద్రంగా మార్చాలి: సత్యకుమార్
తెనాలిని జిల్లా కేంద్రంగా మార్చాలని కొల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబులకు కొల్లూరు మండలం టీడీపీ సీనియర్ నేత వెంకట సత్యకుమార్ వినతిపత్రం అందజేశారు. అదే విధంగా గాజుల్లంక శ్రీకాకుళం మధ్య కాజ్వే నిర్మించాలని, 75 ఎకరాలలో మూతబడి ఉన్న జంపని షుగర్ ఫ్యాక్టరీని మెడికల్ కాలేజీగా మార్చాలని కోరారు.
News December 5, 2024
జగన్ మరో నాటకానికి సిద్దమౌతున్నారు: బాలాజీ
అసెంబ్లీకి వెళ్లకుండా వీధి నాటకాలు ఆడిన వైసీపీ అధినేత జగన్ మరో నాటకానికి సిద్దమౌతున్నారని జనసేన సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ బాలాజి అన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. జగన్ ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్దమౌతున్నట్లు ప్రకటించారని, దీని ద్వారా కూటమి ప్రభుత్వంపై బురదజల్లుడు కార్యక్రమాన్ని కొనసాగించనున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.