News May 18, 2024
సూర్యలంక సముద్ర తీరానికి పోటెత్తిన పర్యాటకులు

బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక సముద్రతీరానికి పర్యాటకులు శనివారం పోటెత్తారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తీరంలో పర్యాటకులు సందడి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లు, పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News May 7, 2025
గుంటూరు జిల్లాలో భద్రతా తనిఖీలు

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు శనివారం గుంటూరు జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ సతీశ్ కుమార్ నేతృత్వంలో బస్టాండ్‌లు, ఆటో స్టాండ్, మార్కెట్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. అనుమానితుల వేలిముద్రలు పరిశీలించారు. వాహనాల రిజిస్ట్రేషన్, సరుకు వివరాలను పరిశీలించారు. అనుమానితులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
News May 7, 2025
పది పరీక్షల సప్లిమెంటరీ ఫీజ్ చెల్లించండి: DEO

మే నెలలో జరగనున్న పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు ఈనెల 30లోపు చెల్లించాలని గుంటూరు డీఈవో సి.వి రేణుక తెలిపారు. 3 సబ్జెక్టులకు రూ.110, అంతకు మించితే రూ.125 చెల్లించాలన్నారు. మే 1 నుంచి పరీక్ష ముందు రోజు వరకు చెల్లిస్తే అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. రీకౌంటింగ్ ఒక్కో సబ్జెక్ట్‌కి రూ.500, రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్ట్‌కి రూ.1,000లు మే 1లోపు చెల్లించాలన్నారు.
News May 7, 2025
గుంటూరు జిల్లా కలెక్టర్ హెచ్చరిక

గుంటూరు కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి పింఛన్ పంపిణీ సిబ్బందికి ముఖ్య సూచనలు చేశారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన పంపిణీలో కొన్ని లోపాలు తేలినట్లు పేర్కొంటూ, వృద్ధులను గౌరవంతో చూడాలని, కులమతాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ నగదు ఇవ్వాలని ఆదేశించారు. అవినీతి, అమర్యాదలకు తావులేకుండా విధులు నిర్వహించాలని హెచ్చరించారు.