News May 18, 2024
సూర్యలంక సముద్ర తీరానికి పోటెత్తిన పర్యాటకులు
బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక సముద్రతీరానికి పర్యాటకులు శనివారం పోటెత్తారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తీరంలో పర్యాటకులు సందడి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లు, పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News December 2, 2024
ఉమ్మడి గుంటూరు జిల్లాలో HIV రోగులు ఎంత మంది అంటే?
అధికారిక గణాంకాల ప్రకారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో HIV రోగులు భారీగా ఉన్నారు. గుంటూరులో 16,630, పల్నాడులో 17,536, బాపట్లలో 11,356 మంది HIV రోగులుండగా, 2023లో అత్యల్ప సంఖ్యలో కొత్తగా వైరస్ సోకిన జిల్లాలో గుంటూరు ఉంది. కాగా HIV రోగులకు ప్రతి నెలా రూ.4,000 పింఛన్ ఇస్తున్నట్లు AP స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(ఏపీ శాక్స్) అధికారులు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 42,924 మందికి ఈ పింఛన్ అందుతుంది.
News December 2, 2024
కారంపూడి వీరుల తిరుణాల్ల… మూడోరోజు మందపోరు
కారంపూడి వీరుల తిరుణాల్లా సందర్భంగా మూడోరోజు మందపోరు… కోడిపోరులో రాజ్యాన్ని కోల్పోయిన మలిదేవాదుల అరణ్యవాసం చేసేందుకు మందాడి గ్రామంలో ఉంటాడు. బ్రహ్మనాయుడిని ఎలాగైనా చంపాలని మండాది గ్రామంపై దాడి చేసింది. ఈ క్రమంలో ఆవులను అంతమొందించేందుకు నాగమ్మ పన్నాగం ద్వారా అడవి చెంచులు దాడి చేసే క్రమంలో కాపరి లంకన్న అసువులు బాస్తాడు. లంకన్నకు శంఖుతీర్ధం ఇవ్వటం ద్వారా బ్రహ్మన్న విముక్తిని ప్రసాదిస్తాడు.
News December 2, 2024
పల్నాటి వీరుల చరిత్రను ఎప్పుడు ముద్రించారో తెలుసా?
పల్నాటి వీరుల చరిత్రను తొలిసారి శ్రీనాథుడు 300 సంవత్సరాల తర్వాత మంజరీ ద్విపద కావ్యముగా రచించగా, ఇది ఆయన చివరి రచన. శ్రీనాథుని తర్వాత కొండయ్య, మల్లయ్య (16వ శతాబ్దం) అను కవులు రచించారు. ఆ తర్వాత 1862 ప్రాంతంలో ముదిగొండ వీరభద్రకవి ఈ కథను వీర భాగవతం పేరుతో మనోహరమైన పద్యకావ్యంగా రచించారు. అక్కిరాజు ఉమాకాంతం మొట్టమొదట పల్నాటి వీరచరిత్ర యొక్క ప్రతులు సంపాదించి, సంస్కరించి 1911లో అచ్చువేయించారని సమాచారం.