News March 10, 2025
సూర్యాపేటకు రూ.400 కోట్లు..!

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు మంజూరు చేస్తూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు ధీటుగా పాఠశాలలు నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని కోదాడ, తుంగతుర్తికి రూ.200కోట్ల చొప్పున రూ.400 కోట్లు మంజూరు చేశారు.
Similar News
News November 19, 2025
MNCL: తీన్మార్ మల్లన్నతో ఉమ్మడి జిల్లా అధ్యక్షుల భేటీ

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో గురువారం ఇటీవల నూతనంగా నియమితులైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు భేటీ అయ్యారు. తమకు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి పాటుపడాలని సూచించారు.
News November 19, 2025
సూసైడ్ బాంబర్ వీడియోలు తొలగించిన META

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతికి పాల్పడిన సూసైడ్ బాంబర్ ఉమర్ సెల్ఫీ వీడియో SMలో వైరలైన విషయం తెలిసిందే. వాటిని META సంస్థ తమ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించింది. తమ యూజర్ గైడ్ లైన్స్కు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘నాది ఆత్మహత్య కాదు.. <<18318092>>బలిదానం<<>>’ అని ఉమర్ ఆ వీడియోలో సమర్థించుకున్నాడు. అయితే ఈ వీడియో ట్విటర్లో అందుబాటులోనే ఉండటం గమనార్హం.
News November 19, 2025
త్వరలో పంచాయతీ ఎన్నికలు.. ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్

TG: గ్రామ పంచాయతీల్లో ఓటరు సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. సెప్టెంబర్ 2న ప్రచురితమైన జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉంటే రేపు(ఈ నెల 20) అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. వాటిపై DPO పరిశీలన చేస్తారని పేర్కొంది. ఈ నెల 23న తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని వెల్లడించింది. త్వరలోనే GP ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.


