News March 10, 2025
సూర్యాపేటకు రూ.400 కోట్లు..!

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు ధీటుగా పాఠశాలలు నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని కోదాడ, తుంగతుర్తికి రూ.200కోట్ల చొప్పున రూ.400 కోట్లు మంజూరు చేశారు.
Similar News
News March 16, 2026
జూన్ నెల శ్రీవారి దర్శన కోటా టికెట్ల వివరాలు

☛ ఈ నెల 18 నుంచి 20 వరకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్
☛ 21న శ్రీవారి ఆర్జిత సేవా, వర్చువల్ ఆర్జిత సేవా టోకెన్ల విడుదల
☛ 23న 10AMకి అంగప్రదక్షిణం ఫ్రీ టికెట్స్, 11AMకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఆన్‌లైన్ కోటా, 3PMకి సీనియర్ సిటిజన్, దివ్యాంగుల కోటా
☛ 24న 10AMకి స్పెషల్ ఎంట్రీ (₹300) దర్శనం టికెట్లు, 3 PM నుంచి గదుల కోటా
News March 16, 2026
భవిత కేంద్రాల పనులు వేగవంతం చేయాలి: ఖమ్మం కలెక్టర్

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను (దివ్యాంగులను) సాధారణ విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దడమే ‘భవిత’ కేంద్రాల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం కొణిజర్ల మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని, చిన్నమునగాల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవిత కేంద్రాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ పరికరాలతో నాణ్యమైన శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు.
News March 16, 2026
రూ.3లక్షల కోట్లకు పైగా బడ్జెట్… చర్చ 6 రోజులే!

TG: అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ కుదించుకుపోతోంది. FY25-26లో ₹3.04L కోట్ల బడ్జెట్ పెట్టగా సభ 11 రోజులు జరిగింది. GOVR ప్రసంగం, ధన్యవాదాలు, బడ్జెట్ ప్రవేశానికి 4రోజులు పోను బడ్జెట్‌పై చర్చ 7రోజుల్లో ముగిసింది. ఈసారి బడ్జెట్ గతం కన్నా పెరిగే అవకాశముంది. ప్రస్తుత సమావేశాలు ఈనెల 30వరకు ఉంటాయి. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, ఆదివారాలు పోను మొత్తం పనిదినాలు 10 రోజులే. అందులో బడ్జెట్‌పై చర్చించేది 6 రోజులే.


