News March 15, 2025

సూర్యాపేటలో రూ.1430 కోట్ల సీఎంఆర్ బకాయిలు

image

సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచింది. సీఎంఆర్ బియ్యం బకాయిలు చెల్లించడంలో 2-3 ఏళ్ల నుంచి మిల్లర్లు జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోనే ఈ విధంగా జాప్యం ఉండడం గమనార్హం. సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్య ధోరణితోనే గతంలో ఈ అవినీతికి తెరలేపినట్లు సమాచారం. రూ.100 కోట్ల అవినీతికి తెరలేపిన వారిపైచర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Similar News

News December 4, 2025

ఇవాళ మిస్ అయితే మళ్లీ 2042లోనే!

image

ఈ ఏడాది ఆఖరి సూపర్ మూన్ మరికొద్దిసేపట్లో ఆవిష్కృతం కానుంది. ఈ రోజు కనిపించే చంద్రుడు 2042 వరకు మళ్లీ ఇంత దగ్గరగా, ఇంత పెద్దగా కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. చందమామ భూమికి అత్యంత <<18450358>>సమీప<<>> పాయింట్‌కు రావడం వల్ల ఇది ‘లార్జెస్ట్ మూన్’గా దర్శనమివ్వనుంది. ఈ అరుదైన ప్రకాశవంతమైన చంద్రుడిని ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 6.30pm తర్వాత అద్భుతంగా కనిపిస్తుంది.

News December 4, 2025

కదిరి యువతికి రూ.45 లక్షల జీతం

image

కదిరి పట్టణానికి చెందిన విద్యార్థి శ్రీ జన్యరెడ్డి భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఆమె క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో బెంగళూరుకు చెందిన NAVI అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో రూ.45 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు శ్రీధర్ రెడ్డి, స్వర్ణలత తెలిపారు. పలువురు శ్రీ జన్య రెడ్డిని అభినందించారు.

News December 4, 2025

చింతకాని: ఓటు వేసేందుకు కెనడా నుంచి వచ్చిన యువకుడు

image

చింతకాని మండలం అనంతసాగర్‌కు చెందిన ప్రేమ్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కెనడా నుంచి వచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో సర్పంచిగా పోటీ చేస్తున్న తన తల్లి లక్ష్మీ కాంతమ్మకు ఓటు వేసేందుకు వచ్చినట్లు వారు చెప్పారు. సుమారు రూ.6 లక్షలు ఖర్చు చేసి అత్యవసరంగా విమాన టికెట్ బుక్ చేసినట్లు పేర్కొన్నారు.