News March 15, 2025
సూర్యాపేటలో రూ.1430 కోట్ల సీఎంఆర్ బకాయిలు

సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచింది. సీఎంఆర్ బియ్యం బకాయిలు చెల్లించడంలో 2-3 ఏళ్ల నుంచి మిల్లర్లు జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోనే ఈ విధంగా జాప్యం ఉండడం గమనార్హం. సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్య ధోరణితోనే గతంలో ఈ అవినీతికి తెరలేపినట్లు సమాచారం. రూ.100 కోట్ల అవినీతికి తెరలేపిన వారిపైచర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
Similar News
News February 12, 2026
KMR: మొదటగా లెక్కించేది పోస్టల్ బ్యాలెట్ ఓట్లే!

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 8 గం.లకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటగా ఓటు హక్కు కలిగి ఉండి పోలింగ్ విధుల్లోని సిబ్బంది వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ అధికారులు లెక్కించనున్నారు. జిల్లాలో 385 మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్‌ల వారీగా ఓట్లు లెక్కిస్తారు.
News February 12, 2026
రమణీయం.. బ్రహ్మోత్సవం

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు గురువారం నీలకంఠుడు భ్రమరాంబ సమేతుడై దశకంఠుడి భుజస్కందాలపై ఊరేగాడు. రావణుడి భుజస్కందాలను అధిష్ఠించిన ఉత్సవ మూర్తులకు ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. రావణవాహనాధీశులైన స్వామి, అమ్మవార్లకు వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.
News February 12, 2026
రేపు వైన్ షాపులు బంద్

TG: రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉ.6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకూ మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రేపు ఉ.8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.


