News April 5, 2024

సూర్యాపేటలో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేటలో జరిగింది. రూరల్ సీఐ సురేందర్ రెడ్డి కథనం ప్రకారం.. రాయినిగూడెం సెవెన్ స్టార్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని గుర్తిస్తే సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో తెలియజేయలన్నారు. 8712686006, 8712683060 నంబర్లను సంప్రదించాలని ఎస్సై బాలునాయక్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News January 16, 2025

రాయగిరి: పండగకు వెళ్లి వస్తుండగా విషాదం

image

WGL- HYD హైవేపై రాయగిరి శివారులో జరిగిన <<15167205>>రోడ్డు ప్రమాదంలో<<>> ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కేసముద్రం మండలం గాంధీపురం గ్రామం వెంకట్రామ్ తండాకు చెందిన భూక్య సంతోష్ తన కుటుంబీకులతో కలిసి పండగకు ఇంటికి వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన భార్య అనూష, కూతురు చైత్ర అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

News January 16, 2025

నల్గొండ: జాతరల సీజన్.. మీరు ఎక్కడికి వెళుతున్నారు!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతరలు, ఉర్సుల సీజన్ మొదలు కానుంది. జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. రెండేళ్లకోసారి జరిగే లింగమంతుల జాతర ఫిబ్రవరి 16న ప్రారంభం కానుంది. ఈ జాతరకు 30 నుంచి 50లక్షల వరకు భక్తులు హాజరవుతారని అంచనా. చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు, మేళ్లచెర్వు జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఎక్కడికి వెళుతున్నారో కామెంట్ చేయండి.

News January 16, 2025

నల్గొండ: చివరి దశకు చేరుకున్న వరి నాట్లు 

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో విస్తరించి ఉంది. సాగర్‌లో నీరు పుష్కలంగా ఉండడంతో గతంతో పోల్చితే ఎక్కువగానే సాగయినట్లు రైతులు చెబుతున్నారు. యాదాద్రి జిల్లాలో కొన్ని చోట్ల బోర్ల పోయకపోవడంతో కొందరు రైతులు భూములను పడావు పెడుతున్నారు.