News February 26, 2026

సూర్యాపేటలో 298 మ్యూల్ అకౌంట్స్ గుర్తింపు

image

TG పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని 4 బ్యాంక్ బ్రాంచ్‌లలో 298 అనుమానాస్పద మ్యూల్ ఖాతాలను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో 137 బ్రాంచ్‌లపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడులు నిర్వహించింది. సరైన వెరిఫికేషన్ లేకపోవడంతో నేరగాళ్లు ఈ ఖాతాల ద్వారా సైబర్ దందాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు. గతంలోనూ పలు గ్రామాల్లో సైబర్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Similar News

News April 14, 2026

వెరీ స్లో ఇన్నింగ్స్.. కోహ్లీపై చోప్రా విమర్శలు

image

ఈనెల 12న ముంబైతో మ్యాచులో RCB ఓపెనర్ విరాట్ కోహ్లీ చాలా స్లోగా ఆడారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించారు. ‘RCB గెలిచినప్పటికీ T20 క్రికెట్ కోణంలో చూస్తే అది చాలా స్లో ఇన్నింగ్స్. విరాట్ స్థాయికి తగ్గట్లుగా లేదు. ఆయన మైండ్‌సెట్ కూడా సరిగా లేనట్లు అనిపించింది. వైడ్ బాల్స్ కోసం రెండు రివ్యూలు వృథా చేశారు’ అని తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు. ఈ మ్యాచులో కోహ్లీ 38 బంతుల్లో 50 రన్స్ చేశారు.

News April 14, 2026

ప్రపంచ మేధావి అంబేడ్కర్: కలెక్టర్ వెట్రిసెల్వి

image

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అంబేడ్కర్ అని కలెక్టర్ వెట్రిసెల్వి కొనియాడారు. ఏలూరు కలెక్టరేట్‌లో అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వివక్షపై రాజీలేని పోరాటం చేసిన అంబేడ్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

News April 14, 2026

పాలమూరు: ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్

image

నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీ గ్రేడ్-IV కార్యదర్శి కిషన్, కొల్లాపూర్ మండలంలోని సింగోటం పంచాయతీ గ్రేడ్-3 కార్యదర్శి అర్జునయ్య, అంకిరావుపల్లి పంచాయతీ గ్రేడ్-3 కార్యదర్శి ప్రేమ్ చంద్‌లను విధుల నుంచి తొలగించారు.