News March 5, 2025
సూర్యాపేట: అంగన్ వాడీ కేంద్రాల్లో కొలువులు

సూర్యాపేట జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులు (ఉద్యోగాలను) భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్ వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాలో 61 టీచర్ పోస్టులు, 191 ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Similar News
News December 17, 2025
ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
☆ తుది విడత పంచాయతీ ఎన్నికల UPDATE కోసం Way2Newsను చూస్తూ ఉండండి.
News December 17, 2025
తుది పోరు.. పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొన్నటి వరకు జోరుగా ప్రచారం చేసిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మ.2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, తర్వాత ఫలితాల వెల్లడి ఉంటుంది. నేటితో రాష్ట్రంలో పంచాయతీ పోరు ముగియనుంది. అయితే రేపటి వరకు సెక్షన్ 136 అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.
News December 17, 2025
కడప జిల్లాలో 47,822 రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్

కడప జిల్లాకు 5,73,675 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయి. వీటి పంపిణీకి గడువు ముగిసింది. 47,822 కార్డులు మిగిలిపోయాయి. వీటిని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నారు. వీటి కోసం రూ.200 చెల్లించి పోస్ట్ ద్వారా పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జమ్మలమడుగు డివిజన్లో 17,514, కడపలో 14,455, బద్వేల్లో 11,112, పులివెందులలో 4,741 రేషన్ కార్డులు మిగిలిపోయాయి.


