News May 25, 2024

సూర్యాపేట: అమ్మమ్మ ఇంటికి వెళ్లి.. అనంతలోకాలకు!

image

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కలంచెరువుకు చెందిన రితీశ్(6) వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైన ఖమ్మం రూరల్ ముత్తగూడెం వచ్చాడు. వీరి ఇంట్లో త్వరలోనే ఫంక్షన్ ఉండగా మేనమామలు కరుణాకర్, వెంకన్నలతో కలిసి పాలేరు సంత నుంచి గొర్రెలు బైక్‌పై తెస్తుండగా.. తిరుమలాయపాలెం KGBV వద్ద ఆగి ఉన్న కారును వీరి బైక్ ఢీకొట్టింది. పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చున్న రితీశ్ తలకు తీవ్రగాయమైంది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.

Similar News

News March 17, 2026

సాగర్ ఎడమ కాల్వలో మిర్యాలగూడ యువకుడి గల్లంతు

image

మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగెల్లి తరుణ్ (22) బొక్కమంతులపాడు శివారులో సాగర్ ఎడమ కాల్వలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి బట్టలు ఉతకడానికి వచ్చిన అతడు సోమవారం సాయంత్రం ఈత కొడుతుండగా నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కొట్టుకుపోయినట్లు తెలిపారు. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అన్న మణిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 17, 2026

NLG: రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

image

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు NLG కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. రేపటి నుంచి 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.