News March 4, 2025
సూర్యాపేట: అరుణాచల గిరి ప్రదక్షిణకు కోదాడ డిపో బస్సులు

తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం కోదాడ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్సు ఈనెల 11వ తేదీ సాయంత్రం 7గంటలకు కోదాడ నుంచి బయలుదేరి 12వ తేదీ ఉదయం కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ్నుంచి వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకొని రాత్రికి అరుణాచలం, 13న పౌర్ణమి గిరిప్రదక్షణ ఉంటుందని తెలిపారు.
Similar News
News March 19, 2025
క్రెడిట్ కార్డులను క్లోజ్ చేస్తున్నారా?

కొందరు ఖర్చులు పెరిగిపోతున్నాయంటూ క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయాలని భావిస్తుంటారు. కానీ వాటిని తీసేస్తే క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. క్రెడిట్ స్కోర్ పడిపోయే ఛాన్స్ ఉంది. ఇవి అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్‌గా ఆదుకుంటాయి. ఈ కార్డులను యాక్టివ్‌గా ఉంచుకోవడమే బెటర్. అతిగా ఖర్చు చేసేవారు మాత్రం క్లోజ్ చేసుకుంటేనే మంచిది. మీరు ఉపయోగించకపోయినా మేనేజ్‌మెంట్ ఛార్జీలు ఎక్కువైతే కార్డు తీసేయడం ఉత్తమం.
News March 19, 2025
ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయించండి: మంత్రి నాదెండ్ల

AP: దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. అన్నదాతలకు అందుబాటులో 5 లక్షల గన్నీ సంచులున్నాయని తెలిపారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
News March 19, 2025
అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేయండి: సుప్రీం

దేశంలోని చాలా రాష్ట్రాల్లో రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేదలు అనుభవించాల్సిన ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. వెంటనే అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయాలని జస్టిస్ సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దేశంలో దాదాపు 80 శాతం మంది నిరుపేదలు ఉన్నారని, వారందరికీ ఆహార భద్రత ఎంతో అవసరమని పేర్కొంది.