News January 31, 2025
సూర్యాపేట: ఆటో బోల్తా.. ఎనిమిది మందికిపైగా గాయాలు

రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలైన ఘటన చివ్వెంల మండలంలో గురువారం సాయంత్రం జరిగింది. బాధితుల వివరాలిలా.. కూలీలు మిరప తోట నుంచి ఆటోలో ఇళ్లకు వస్తుండగా లక్ష్మీనాయక్ తండా వద్ద కుక్క అడ్డువచ్చింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహనం బోల్తా పడింది. ఆటోలో 15 మందికి పైగా కూలీలు ఉండగా, ఎనిమిది మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News November 26, 2025
ములుగు: సర్పంచ్ నేనే.. నాకు కన్ఫర్మ్ అయ్యింది!

ములుగు జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కాగా, పోటీలో ఉన్న అభ్యర్థులు టికెట్ వస్తుంది.. నన్ను కన్ఫామ్ చేశారంటూ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి వారే నేనే సర్పంచ్ అంటే.. నేనే సర్పంచ్ అంటూ గ్రామాల్లో గప్పాలు కొడుతుండటంతో ఓటర్లు తికమక పడుతున్నారు.
News November 26, 2025
ట్యాంక్‌బండ్ వద్ద ఆందోళన.. ట్రాఫిక్ జామ్

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GO 46ను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ నాయకులు ట్యాంక్‌బండ్‌పై ఆందోళన చేపట్టారు. రిజర్వేషన్లలో భాగంగా కొన్ని మండలాల్లో బీసీలకు పంచాయతీలు రిజర్వ్ కాలేదన్నారు. రాస్తారోకో చేపట్టడంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి తరలించారు.
News November 26, 2025
‘కమ్లా పసంద్’ ఓనర్ కోడలు ఆత్మహత్య

పాపులర్ పాన్ మసాలా కంపెనీ ‘కమ్లా పసంద్’ ఓనర్ కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా(40) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ వసంత్ విహార్‌లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకొని కనిపించారు. దీప్తి గదిలో పోలీసులు సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో భర్త హర్‌ప్రీత్ చౌరాసియా పేరును రాసినట్లు తెలుస్తోంది. 2010లో దీప్తి-హర్‌ప్రీత్ వివాహం చేసుకున్నారు. వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు.


