News March 9, 2025
సూర్యాపేట: ఆ 8 మంది సజీవ సమాధి..?

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట SLBC టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినప్పటికీ అతనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ఆ మృతదేహం పక్కనే మరో రెండు మృతదేహాలు ఉన్నప్పటికీ వాటిని వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Similar News
News January 21, 2026
TTD చరిత్రలో మొట్టమొదటిసారిగా.!

ఓ రిటైర్డ్ IAS అధికారిని TTD తొలిసారిగా జేఈవోగా నియమించడం చర్చనీయాంశమైంది. టీటీడీ జేఈవో(హెల్త్ అండ్ ఎడ్యుకేషన్)గా డాక్టర్ ఏ.శరత్ నియమితులైన విషయం తెలిసిందే. ఈయన 2005 బ్యాచ్ IAS అధికారి. రిటైర్డ్ అయిన వారి సేవలు కావాలంటే ప్రత్యేకాధికారిగా, సలహాదారులుగా, కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ కింద ఇప్పటి వరకు నియమిస్తున్నారు. అయితే నూతన జేఈవో నియామకంపై ఉద్యోగులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.
News January 21, 2026
WPL: ఇక థ్రిల్లింగ్ మ్యాచులేనా?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL-2026) ఈసారి థ్రిల్లింగ్‌గా మారింది. ఇప్పటికే RCB ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోగా మిగతా 2 జట్లు తేలాల్సి ఉంది. MI, యూపీ, గుజరాత్, ఢిల్లీ నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై మిగతా 2 మ్యాచ్‌ల్లో గెలిస్తేనే పోటీలో ఉంటుంది. అటు గుజరాత్, ఢిల్లీ, UP తొలిసారి ట్రోఫీని అందుకునే అవకాశాన్ని నిలుపుకోవాలంటే మిగతా మ్యాచుల్లో ఆధిపత్యం ప్రదర్శించాల్సిందే.
News January 21, 2026
గ్రామపంచాయతీ నుంచి రామగుండం కార్పొరేషన్ వరకు..

జనగామ గ్రామ పంచాయతీ 11 వార్డులతో సర్పంచిగా గీట్ల జనార్థన్ రెడ్డి నుంచి రామగుండం 60 డివిజన్ల కార్పొరేషన్ వరకు విస్తరించింది. 1982లో రామగుండం నోటిఫైడ్ ఏరియా, 1957- 2009 వరకు RGM ప్రాంతం మేడారం నియోజకవర్గంలో ఉండేది. 1995లో మున్సిపాలిటీగా, 2003లో కార్పొరేషన్‌గా హోదా పెరిగింది. కార్పొరేషన్‌కు ఈసారి మూడోసారి ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 93.87 చ.కి. వైశాల్యంలో విస్తరించి ఉంది.


