News March 4, 2025
సూర్యాపేట: ఇంటర్ విద్యార్థులకు ALL THE BEST చెప్పిన కలెక్టర్

చివ్వెంల మండలం ఐలాపురంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రేపు జరగబోయే ఇంటర్ పరీక్షలను విద్యార్థులు బాగా రాయాలని సూచించారు. అన్ని పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ ALL THE BEST చెప్పారు. అనంతరం స్టాఫ్ హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఉపాధ్యాయులు అందరూ సమయపాలన పాటించాలన్నారు.
Similar News
News March 5, 2025
పార్వతీపురంలో చినజీయర్ స్వామి

పార్వతీపురం పట్టణం బెలగాంలో శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి ప్రముఖ పీఠాధిపతి రామనుజం శ్రీచినజీయర్ స్వామి వచ్చారు. పార్వతీపురంలో రామ పాదుక ఆరాధన కార్యక్రమం బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన వచ్చారు. దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారులు, తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
News March 5, 2025
మంచిర్యాల జిల్లాలో 23 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

మంచిర్యాల జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి పరిసరాల్లో BNS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 12,540 మంది పరీక్ష రాయనున్నారు.
News March 5, 2025
ఒకటో తేదీనే మిడ్ డే మీల్ బిల్లులు

TG: స్కూళ్లలో మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రతినెలా ఒకటో తేదీనే బిల్లులు చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. తొలుత పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ప్రతినెలా ఎంత మంది విద్యార్థులు భోజనం చేశారో MDM యాప్‌లో నమోదు చేయగానే బిల్లు జనరేట్ అయ్యేలా మార్పులు చేయనుంది. బిల్లుకు HM, MEO ఆమోదం తెలపగానే ఖాతాల్లో బిల్లు మొత్తం జమ అవుతుంది.